Devanakonda: ఒకే రంగు చీరల్లో మహిళల సందడి.. శోభాయాత్రకు ప్రత్యేక కళ!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అల్లారుదిన్నె గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.
Devanakonda: ఒకే రంగు చీరల్లో మహిళల సందడి.. శోభాయాత్రకు ప్రత్యేక కళ!
దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అల్లారుదిన్నె గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపంలో నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు నిత్య పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే వేళ భక్తులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
గ్రామంలో నిమజ్జన శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతుండగా మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయబద్ధమైన చీరలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అల్లారుదిన్నె గ్రామంలోని మహిళలందరూ ఒకే రంగు, ఒకే విధమైన చీరలు ధరించి శోభాయాత్రలో పాల్గొనడం చూపరులను ఆకట్టుకుంది.
భక్తి, సంప్రదాయం, ఆనందోత్సాహాల మధ్య మహిళలు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రామ వీధులు గణేష్ నామస్మరణలు, భక్తిగీతాలతో మార్మోగాయి. నిమజ్జన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక సందడిని నెలకొల్పారు.




