Kurnool: వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కార్యవర్గం ప్రమాణస్వీకారం!
Kurnool: వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం. తిరుపతిలో పేద బ్రాహ్మణుల వివాహాలకు రూ. 2 లక్షల సాయం ఏపీ చీఫ్ ఏఎస్వీ రావు.
Kurnool: వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కార్యవర్గం ప్రమాణస్వీకారం!
కర్నూలు: దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులను ఏకతాటి పైకి తీసుకువచ్చి భార తీయ సంస్కృతి, నాగరి కత, సామాజిక సంక్షే మం, జాతీయ ప్రయోజ నకర కార్యక్రమాలలో బ్రాహ్మణ సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాక బ్రాహ్మణులను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం అని " వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్" ప్రధాన లక్ష్యమని ఆ ఫెడరేషన్ చైర్మన్ పండిట్ శశికాంత్ శర్మ అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుచానూరురోడ్డులోని కె.కె.క ల్యాణమండపంలో వివిధ జిల్లాల నూతన కార్యవర్గం పదాధికారులు, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా(కర్నూలు , నంద్యాల) అధ్యక్షుడిగా మామిళ్ళపల్లి నాగఫణి శాస్త్రి, కార్యదర్శిగా మాళిగి భాను ప్రకాష్ , ఉపాధ్య క్షులుగా డా.వినయ్, (నంద్యాల)
సహకార్యదర్శి గా కరణం సుధాకర్, కోశాధికారి గా కంచుగంటల శ్యామ్ సుందర్ శర్మ ....ప్రమాణం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు సాయిరామ్ (ఏ.ఎస్.వీ.రావు) మాట్లాడుతూ ....పేద బ్రాహ్మణ అమ్మాయిల వివాహం కోసం తిరుపతి లో కళ్యాణ మంటపం, భోజనాలు, వసతి, తో పాటు 2 లక్షల రూపాయల విలువ గల మాంగల్యాన్ని కూడా ఇచ్చి వివాహం చేస్తామని తెలియజేశారు.
అలాగే నెల్లూరు, అనంతపురం, కడప, కర్నాలు జిల్లాల నూతన కార్యవర్గాలు ప్రమాణం చేశాయి. అనం తరం సంస్థ లక్ష్యాలు, సిద్ధాంతాలు, సామాజిక బాధ్యతల పట్ల నిబద్ధతను నూతన కమిటీ పదాధికారులకు వివరించారు. మంత్రరాజపీఠం పీఠాధి పతి ప్రసన్న కరుణాకరం వెంకటనాథ సింహయాజీ స్వామి, వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పండిట్ దల్సింన్అట్రీజి,ట్రెజరర్ బల్బీర్శర్మ, ఏపీస్టేట్ ప్రెసిడెంట్ ఏ.ఎస్.వెం కటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్, సంయుక్తకార్యదర్శి డాక్టర్ బి.చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.




