Kurnool: పెరుగుతున్న జనాభాతో సవాళ్లు.. దేశాభివృద్ధిలో యువతే కీలకం!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు. విద్యార్థులకు సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించిన ప్రిన్సిపాల్ నాగస్వామి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 11 July 2026 5:57 PM IST
Kurnool
X

Kurnool: పెరుగుతున్న జనాభాతో సవాళ్లు.. దేశాభివృద్ధిలో యువతే కీలకం!

Kurnool: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జనాభా, ఆరోగ్యం, సామాజిక బాధ్యతలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలవడం అభివృద్ధికి అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తీసుకువస్తుందని తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, శాస్త్రీయ దృక్పథంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

వక్తలు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, సోదరభావాన్ని పెంపొందించుకోవడం, దేశాల మధ్య ఐక్యత మరియు శాంతిని కాపాడే విలువలను అలవరచుకోవడం, సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వనరులను సమర్థవంతంగా వినియోగించడం, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో యువత చైతన్యవంతంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జనాభా నియంత్రణ, కుటుంబ సంక్షేమం, సామాజిక విలువలు, పరిశుభ్రత మరియు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాల్సిన అవసరంపై అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, ఉల్గోజి రావు, శరధి పటేల్, చిన్న మల్లేశ్, కృష్ణ మోహన్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story