Nandyal: మద్దిగుండం చెరువు పనుల్లో గోల్‌మాల్: రూ. 37 లక్షలు ఏమయ్యాయి?

Nandyal: నంద్యాల జిల్లా జలకనూరు మద్దిగుండం చెరువు గండి మరమ్మతు పనుల్లో అవినీతి జరిగిందని వైసీపీ నేత డా. సుదీర్ దారా సంచలన ఆరోపణలు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 7 Jun 2026 2:54 PM IST
Nandyal
X

Nandyal: మద్దిగుండం చెరువు పనుల్లో గోల్‌మాల్: రూ. 37 లక్షలు ఏమయ్యాయి?

నంద్యాల జిల్లా: మిడుతూరు మండలం జలకనూరు గ్రామం మద్దిగుండం చెరువు గండి మరమ్మతు పనుల్లో భారీ అవినీతి జరిగిందంటూ వైసీపీ నేత డా. సుదీర్ దారా సంచలన ఆరోపణలు చేశారు. రూ.37 లక్షలు మంజూరైతే, రూ.10 లక్షలు కూడా ఖర్చు చేయకుండా నాసిరకం పనులు చేశారని మండిపడ్డారు.

వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా. సుదీర్ దారా మద్దిగుండం చెరువు వద్దకు వెళ్లి గండి పూడ్చిన తీరును పరిశీలించారు. పనుల నాణ్యత చూసి ఆశ్చర్యపోయిన ఆయన, గత టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకం కింద చేసిన నాసిరకం పనుల వల్లే గత ఆగస్టులో చెరువుకు గండి పడిందని గుర్తు చేశారు.

"చెరువుకు గండి పూడ్చేందుకు ప్రభుత్వం రూ.37 లక్షలు మంజూరు చేసింది. కానీ కనీసం రూ.10 లక్షలు కూడా ఖర్చు చేయకుండా నాసిరకంగా పనులు చేపట్టారు. చెరువు గండిని పూడ్చాల్సింది పోయి, ఇరిగేషన్ అధికారులు చేయాల్సిన పనులను సివిల్ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పి టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ప్రతి పనిలో టీడీపీ నేతలకు పర్సంటేజ్ ఉందని వారి నేతలే చెప్తున్నారు."

నాణ్యత లేని పనుల వల్ల పెద్ద వర్షం పడితే మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని సుదీర్ దారా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువు నీరు చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా పాణ్యం నియోజకవర్గ గ్రామాలకు కూడా వెళ్తుందని, గండి పడితే వేలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

"గత ఆగస్టులో చెరువు గండి పడి వేల ఎకరాల్లో రైతులు పండించిన పంటలు నీట మునిగాయి. నష్టపోయిన రైతులను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన పనులు చేయించాలి. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం." అని హెచ్చరించిన సుధీర్ ధారా.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story