Kurnool: వరి నారతో వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన ఎమ్మిగనూరులో ధర్నా!

Kurnool: ఎమ్మిగనూరు ఎల్ఎల్సీ కార్యాలయం వద్ద వరి నారతో వైఎస్సార్‌సీపీ నిరసన. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలని రాజీవ్ రెడ్డి డిమాండ్.

S Khaleel, Yemmiganur
Published on: 21 Aug 2026 2:29 PM IST
Kurnool
X

Kurnool: వరి నారతో వైఎస్సార్‌సీపీ వినూత్న నిరసన ఎమ్మిగనూరులో ధర్నా!

Kurnool: ఎమ్మిగనూరులో వరి నార తో వైసీపీ వినూత్న నిరసన తెలిపింది. రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఇంచార్జ్ రాజివ్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఎల్ఎల్సీ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఎల్ ఎల్సీ కార్యాలయం వద్ద వరి నార తో ధర్నా నిర్వహించారు .ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైసీపీ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి ఆరోపించారు.

ఎల్ఎల్సీకి వెంటనే నీటిని విడుదల చేయడంతో పాటు, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story