శ్రీలక్ష్మికి ఒక న్యాయం.. సునీల్ కుమార్‌కు ఒక న్యాయమా? సీఎం చంద్రబాబుకు శోభన్ బాబు ప్రశ్న

సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.వీ. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్ బాబు డిమాండ్ చేశారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 29 Jun 2026 7:38 AM IST
శ్రీలక్ష్మికి ఒక న్యాయం.. సునీల్ కుమార్‌కు ఒక న్యాయమా? సీఎం చంద్రబాబుకు శోభన్ బాబు ప్రశ్న
X

శ్రీలక్ష్మికి ఒక న్యాయం.. సునీల్ కుమార్‌కు ఒక న్యాయమా? సీఎం చంద్రబాబుకు శోభన్ బాబు ప్రశ్న

దళితుల పట్ల విపక్ష తగదు సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.వీ. సునీల్ కుమార్ సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేసి, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైసిపి ఎస్సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్ బాబు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన ప్రశాంత వాతావరణంలో రిటైర్ అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని రిటైర్మెంట్కు ముందు విధుల్లోకి తీసుకున్నట్లే, సునీల్ కుమార్ విషయంలోనూ సాను కూలంగా స్పందించి దళితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, అన్ని వర్గాలకూ సమన్యాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే దళిత ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి కారుపై రాళ్లతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు హింసకు దారితీయడం అత్యంత దురదృష్టకరం. ప్రజాప్రతినిధిపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని అన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story