Yemmiganur: ఎమ్మిగనూరులో ఇటుకల బట్టిపై కాలనీవాసుల ధర్నా
Yemmiganur: ఎమ్మిగనూరు ఎల్లమ్మ బీడు కాలనీ నివాసాల సమీపంలో ఇటుకల బట్టి ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోందని, దానిని వెంటనే తొలగించాలని కాలనీవాసులు ధర్నా చేపట్టారు.
Yemmiganur: ఎమ్మిగనూరులో ఇటుకల బట్టిపై కాలనీవాసుల ధర్నా
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలోని ఎల్లమ్మ బీడు కాలనీ నివాసాల సమీపంలో ఇటుకల బట్టి ఏర్పాటును నిరసిస్తూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కాలనీకి అతి సమీపంలో ఇటుకల బట్టి ఏర్పాటు చేయడం వల్ల 24 గంటలు పోగ, దుమ్ము, దూళి రావడం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం కారణంగా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని వారు వాపోయారు. ఈ సమస్యపై ఇప్పటివరకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.
తక్షణమే ఈ ఇటుకల బట్టిని ఇక్కడి నుండి తొలగించాలని, లేకపోతే తమ ఆందోళనను ఆపేది లేదని కాలనీ వాసులు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఈ సమస్యను పరిష్కరించి, నివాసాలకు దూరంగా ఇటుకల బట్టిని ఏర్పాటు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.




