Yemmiganur: ఎమ్మిగనూరులో సినీ ఫక్కీలో దొంగను పట్టుకున్న పోలీసులు

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బైక్‌లో ఉంచిన రూ.2 లక్షలు దొంగిలించిన వ్యక్తిని సీసీటీవీ విజువల్స్ సాయంతో బస్టాండ్ వద్ద వెంబడించి పోలీసులు పట్టుకున్నారు.

S Khaleel, Yemmiganur
Published on: 26 Sept 2026 3:36 PM IST
Yemmiganur
X

Yemmiganur: ఎమ్మిగనూరులో సినీ ఫక్కీలో దొంగను పట్టుకున్న పోలీసులు

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో సినీ ఫక్కీలో దొంగను పోలీసులు పట్టుకున్నారు. వైఎస్సార్ సర్కిల్‌లోని ఓ స్వీట్ షాప్ వద్ద బైక్‌లో ఉంచిన రూ.2 లక్షల నగదును దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన స్వీట్ షాప్ సీసీ కెమెరాల్లో రికార్డైంది.

పొలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు వెళ్ళిపోయాడు. అయితే రాత్రి బస్టాండ్ ప్రాంతంలో దొంగను గుర్తుపట్టిన స్వీట్ షాప్ యజమాని దొంగ దొంగ అంటూ అరిచాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే.. దొంగను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. దొంగను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur