Markapuram: యర్రగొండపాలెం దారుణం.. యువకుడిని హత్య చేసి బోరుబావిలో వేసిన దంపతులు

Markapuram: యర్రగొండపాలెంలో హత్యకు గురైన ఆంజనేయులు మృతదేహం కోసం పోలీసులు బోరుబావిలో గాలించారు.

Srikanth Singam, Markapur
Published on: 21 May 2026 8:00 PM IST
Markapuram
X

Markapuram: యర్రగొండపాలెం దారుణం.. యువకుడిని హత్య చేసి బోరుబావిలో వేసిన దంపతులు

మార్కాపురం జిల్లా: యర్రగొండపాలెంలో ఈ నెల 13న హత్యకు గురైన ఆంజనేయులు అనే యువకుడి మృత దేహం కోసం పోలీసులు వెతుకులాట చేపట్టారు. తన కూతురి తో సన్నితంగా ఉన్నాడంటూ.. వేంకట నారాయణ, రవణ దంపతులు కలిసి ఆంజనేయులును దారుణంగా హత్య చేశారు. ఆపై ఎవరికీ అనుమాణం రాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలు గా నరికి బోరు బావిలో వేశారు. ఈ నేపథ్యంలో మృత దేహం ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీం, మార్కాపురం నుంచి వచ్చిన కూల్ టీం లతో ముందుగా నిందితుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం బోరు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఎయిర్ కంప్రజర్,సెప్టిక్ ట్యాంక్,అగ్నిమాపక వాహనాలతో మృత దేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో దుప్పటి, చున్నీ, మృతదేహానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు ఎముకలు బయటికి వచ్చాయి. రాతి నెల కావడంతో పూర్తిస్థాయిలో మృతదేహాన్ని తీసేందుకు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో మృతుని బంధువుల సమ్మతించడం తో మృత దేహం బయటికి తీసే ప్రయత్నం పోలీసులు ఆపేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొరికిన అవయవాలతో శవపంచనామతో పాటు ఇతర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story