Pattikonda: ఆలయ ప్రాంగణంలో యోగాసనాలు.. 21 వరకు కొనసాగనున్న 'యోగాంధ్ర' వేడుకలు!
Pattikonda: పత్తికొండ మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం.
Pattikonda: ఆలయ ప్రాంగణంలో యోగాసనాలు.. 21 వరకు కొనసాగనున్న 'యోగాంధ్ర' వేడుకలు!
పత్తికొండ: పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. పెరవలి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
యోగ గురువు టి. ఓబులేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది, పాలక మండలి చైర్మన్, సభ్యులు, గ్రామ ప్రజలు, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగాభ్యాసం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ప్రతిరోజూ నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ఉదయం 8 గంటలలోపు దేవస్థానానికి చేరుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఈ యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుందని, భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.




