Banaganapalle: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బలై యువకుడు ఆత్మహత్య!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గంలో ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి బలై అప్పుల బాధతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు మనోహర్.

Ramanaiah, Banaganepalle
Published on: 7 Oct 2026 1:15 PM IST
Banaganapalle
X

Banaganapalle: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బలై యువకుడు ఆత్మహత్య!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి 4 లక్షలు అప్పులు చేసుకున్న యువకుడు అప్పుల ల్లో నుండి వత్తిడి రావడం తో అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై కత్తిపీటతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు మనోహర్(24)

ఈ నెల 1వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయం చూసి కత్తిపీటతో గొంతు కోసుకొని ఆపస్మరక స్థితికి చేరుకున్న మనోహర్. గమనించిన కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యువకుడు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మనోహర్ మృతి చెందినట్లు తెలిపిన నందివర్గం ఎస్ఐ భూపాలుడు

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle