Nandyal: నంద్యాలలో దారుణ హత్య.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ జావళి
Nandyal: నంద్యాల మండలం కానాల గ్రామ శివారులో దారుణ హత్య కలకలం. యువకుడి తలపై బీరు బాటిల్‌తో దాడి చేసి హతమార్చిన దుండగులు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ జావళి.
Nandyal: నంద్యాలలో దారుణ హత్య.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ జావళి
నంద్యాల జిల్లా: నంద్యాల మండలం కానాల గ్రామ శివారులో దారుణ హత్య..బీరు బాటిల్‌తో తలపై దాడి చేసి యువకుడి హత్య..తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే మృతి..మృతుడు ఎవరు..? గుర్తింపు కోసం పోలీసుల విచారణ..సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ జావళి..
నంద్యాల మండలం కానాల గ్రామ శివారులో శనివారం దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిపై బీరు బాటిల్‌తో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. యువకుడి తలపై తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ జావళి ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మృతదేహం గుర్తుతెలియని వ్యక్తిదిగా పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడివారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




