Kallur: కల్లూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

Kallur: శరిన్ నగర్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు. హాజరైన నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి. వైఎస్సార్‌ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 July 2026 2:49 PM IST
Kallur
X

Kallur: కల్లూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

కల్లూరు అర్బన్: 29వ వార్డు శరిన్ నగర్ లో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా కర్నూలు యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివా రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి 29వ వార్డు కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, కాటసాని రామభూపాల్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఉత్సాహభరితంగా, ఘనంగా నిర్వహించారు.

కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని అన్నారు. రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ మాజీ కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాలలో వివిధ హోదాల్లో ఉన్న వారు తదితరులు పాల్గొన్నారు..

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story