Devanakonda: దేవనకొండ సర్పంచ్ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎర్రగోటి అంజి!

Devanakonda: ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన ఎర్రగోటి అంజి సోమవారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.

G Jagadeesh, Pathikonda
Published on: 16 Nov 2026 7:38 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండ సర్పంచ్ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎర్రగోటి అంజి!

దేవనకొండ: ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎర్రగోటి అంజి సోమవారం భారీ ర్యాలీగా తరలివచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, యువకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం కనిపించింది. ఎర్రగోటి అంజికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ.. అంజి అన్నకు తామంతా అండగా ఉంటామని, ఆయన విజయానికి తమ వంతు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, మౌలిక సదుపాయాల కల్పనతో దేవనకొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ఎర్రగోటి అంజి ఎన్నికల బరిలో నిలిచారు.

ప్రజల ఆశీస్సులు, అభిమానుల ఆదరణ, కార్యకర్తల సహకారంతో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నామినేషన్ కార్యక్రమంతో దేవనకొండలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda