Kodumuru: కోడుమూరులో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు ర్యాలీతో వెళ్లిన రఘునాథ రెడ్డి
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు 4వ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రఘునాథ రెడ్డి భారీ ర్యాలీతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
Kodumuru: కోడుమూరులో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు ర్యాలీతో వెళ్లిన రఘునాథ రెడ్డి
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో MPTC ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
పట్టణంలోని 4వ MPTC స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిగా రఘునాథ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన MPDO కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమేష్ నాయుడు, ప్రవీణ్, తేజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాజిత్ అలీ, ముల్లా మగ్బుల్ బాషా, సునార్ షాషావలి, హనుమంతు,పాముల శ్రీను, జగదీశ్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




