Banganapalle: రోడ్డెక్కి ఆటో లాగిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి!
Banganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన.
Banganapalle: రోడ్డెక్కి ఆటో లాగిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి!
నంద్యాల జిల్లా: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాటసాని రామిరెడ్డి నివాసం నుండి బనగానపల్లె నియోజకవర్గంలోని కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆటోకు తాళ్ళు కట్టి కార్యకర్తలతో ఆటోను గుంజుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ భారం పడిందని కాటసాని రామిరెడ్డి అన్నారు.
పెట్రోల్, డీజిల్ కాకుండా రైతులు వాడే కాంప్లెక్స్ ఎరువులు 600 లనుండి 1200 ల వరకు పెరిగాయి అని అన్నారు ఇరాన్ - అమెరికా యుద్ధం జరుగుతుందని కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు మీ పలుకుబడి ఉపయోగించి యుద్ధాన్ని ఆపాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఆవుకు మండల ఇంచార్జ్ కాటసాని తిరుపాల్ రెడ్డి అబ్దుల్ ఫైజ్ అబ్దుల్ ఖైర్ గడ్డం అమిర్ భాష ఇర్షాద్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.




