Emmiganur: ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థులకు బెదిరింపులు: రాజీవ్ రెడ్డి ఫైర్
Emmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజీవ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Emmiganur: ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థులకు బెదిరింపులు: రాజీవ్ రెడ్డి ఫైర్
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పోలీసులు, టీడీపీ నాయకులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వైసీపీ ఇంచార్జ్ రాజివ్ రెడ్డి ఆరోపించారు. అవసరమైతే పోలీసు అధికారుల,నాయకుల కాల్ రికార్డింగ్ లు,ఆధారాలతో న్యాయస్థానం కు వెళ్తామని ఇంచార్జ్ హెచ్చరించారు.
షాడో ఎమ్మెల్యే,విజయవాడ ఎమ్మెల్యే ఇద్దరు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారాని మళ్ళీ బెదిరింపు లు ఎందుకని ప్రశ్నించారు. 44 వార్డులు గెలుచుకోండి... కానీ బెదిరింపు లు చేయవద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవేళ బెదిరింపు లు ఇలాగే కొనసాగితే ఎమ్మెల్ ఇంటి ముందు ధర్నా చేస్తానని ఇంచార్జ్ రాజివ్ రెడ్డి హెచ్చరించారు.




