Markapuram: "వెన్నుపోటుకు రెండేళ్లు".. కూటమి ప్రభుత్వంపై మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ సమరభేరి!

Markapuram: మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూటమి ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Jun 2026 1:12 PM IST
Markapuram
X

Markapuram: "వెన్నుపోటుకు రెండేళ్లు".. కూటమి ప్రభుత్వంపై మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ సమరభేరి!

Markapuram: మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. బుధవారం మార్కాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4న మార్కాపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు, 5న తర్లుపాడులో ఉదయం 9 గంటలకు, కొనకనమిట్లలో ఉదయం 10.30 గంటలకు, పొదిలిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 8, 9 తేదీల్లో కూటమి ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలపై చర్చావేదికలు, 12న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శంషాయర్ అలీబేగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సలీం, కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story