Nandikotkur: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్‌పై నందికొట్కూరులో వైఎస్‌ఆర్‌సీపీ మండిపాటు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Nandikotkur: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్‌పై నందికొట్కూరులో వైఎస్‌ఆర్‌సీపీ మండిపాటు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఓటు వేయడానికి వెళ్లిన మా నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని ఎందుకు అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ముఖ్యనాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరియు పోలీసులు.
ప్రతి మండలం నుంచి దాదాపుగా 5 నుంచి 10 మంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తే, తాము యదేచ్చగా రిగ్గింగు చేసుకోవచ్చని కూటమి నాయకుల ఆలోచన. అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే వారివారి గ్రామాలకు తీసుకువెళ్లకపోతే జిల్లా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్.
మునుపెన్నడు లేని విధంగా అప్రజాస్వామ్యంగా ఎన్నికలను అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. ముచ్చుమర్రిలో మా నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అరెస్ట్ చేసి మరి అక్కడే నంద్యాల ఎంపి బైరెడ్డి శబరిని ఎందుకు మినహించారో సమాధానం చెప్పాలని అన్నారు.




