Markapur: మార్కాపురం నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను కలిసిన వైయస్ఆర్సీపీ నేత!

Markapur: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్ మీనాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Oct 2026 11:50 AM IST
Markapur
X

Markapur: మార్కాపురం నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను కలిసిన వైయస్ఆర్సీపీ నేత!

Markapur: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్ కుమార్ మీనాను వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన ఎస్పీ పార్టీలకు అతీతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు. న్యాయం కోసం పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు పోలీసు శాఖపై నమ్మకంతో ఆశ్రయిస్తారని అన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేసి మంచి అధికారిగా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పేరు తెచ్చుకుంటారనే నమ్మకం తమకు, జిల్లా ప్రజలకు ఉందని గౌస్ మోహిద్దీన్ తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM