Yemmiganur: జూలై 15 నుంచి ప్రజల్లోకి వైసీపీ.. కూటమి వైఫల్యాలపై పోరాటం!

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్ బుట్టా రాజివ్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టారు.

S Khaleel, Yemmiganur
Published on: 14 July 2026 2:27 PM IST
Yemmiganur
X

Yemmiganur: జూలై 15 నుంచి ప్రజల్లోకి వైసీపీ.. కూటమి వైఫల్యాలపై పోరాటం!

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్ రాజివ్ రెడ్డి కూటమి వైఫల్యాలను ఎండగట్టటానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుండి ప్రజల వద్దకు వెళ్లి రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటానన్నారు.

గంజెల్ల గ్రామంలో అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుగా నిలిచిన వైసీపీ కార్యకర్తలపై ప్రోక్లైన్‌తో తొక్కించాలంటూ టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రేరేపించారంటూ రాజీవ్ రెడ్డి ఆరోపించారు.

ఏం చేస్తారో చూస్తానని అక్కడి నుండే కార్యక్రమాన్ని ప్రారంభిస్తానాని రాజివ్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి నమస్తే ఎమ్మిగనూరు పోరుబాట పోస్టర్ ను రాజివ్ రెడ్డి విడుదల చేశారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story