Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ డీజిల్ కొరత.. వైకాపా ధ్వజం
Kurnool: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరతపై వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మండిపడ్డారు.
Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో కృత్రిమ డీజిల్ కొరత.. వైకాపా ధ్వజం
Kurnool: కూటమి ప్రభుత్వంలో అన్ని కొరతలేనని మొన్నటి వరకు గ్యాస్ కొరత, ప్రస్తుతం పెట్రోల్ ,డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,సామాన్యుడికి ఇందన వనరుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి తెర్నేకల్లు సురేంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం దేవనకొండ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తూ పారిశ్రామిక సంస్థలకు ఇంధన వనరులను తరలించి ప్రజలను విస్మరిస్తూ చాలిచాలని నిల్వలు ఉంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో కనపడని పెట్రోల్, డీజిల్ కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తుందని ఆయన విమర్శించారు.
రైతుల పొలాల వేసవి దిక్కులు ముంచుకొస్తున్న తరుణంలో డీజిల్ కొరత ఉండడంతో రైతులు పలు అవస్థలు పడుతున్నారన్నారు. డీజిల్ లేకపోతే వేసవి దిక్కులు దున్నుకునేందుకు ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి రాని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భరోసా కల్పించకుండా రైతుల నడ్డి విరుస్తున్నారని, గత ఏడాది చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం నిలబడిన రైతులను గుర్తించుకొని ఈ ఏడాది ఎరువులు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
డీజిల్ కొరత ఉండడంతో నిత్యవసర ధరలు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులను చైతన్యపరిచి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఉద్యమ బాట చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లుముంబా, తెర్నేకల్ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.




