Manekurthi: హామీలు నెరవేర్చక కూటమి సర్కార్ భయపడుతోంది!

Manekurthi: ఆలూరు మండలం మానేకుర్తిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర నాయకుడు సురేంద్ర రెడ్డి. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా జరిపించాలని డిమాండ్.

Bheemalinga, Aluru
Published on: 1 Nov 2026 6:52 AM IST
Manekurthi
X

Manekurthi: హామీలు నెరవేర్చక కూటమి సర్కార్ భయపడుతోంది!

Manekurthi: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మానేకుర్తి గ్రామంలో మీడియా సమావేశం లొ రాష్ట్ర నాయకుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. ఎన్నికలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజలకు మంచి పాలన అందించి ఉంటే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవచ్చని అన్నారు.

మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

రైతులకు పంటల బీమా, గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల ముందుకు రావడానికి కూటమి నేతలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అరెస్టులు చేస్తూ, నామినేషన్లు వేయకుండా, ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం, పోలీసు అధికారులు, గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోరారు. ఆలూరు నియోజకవర్గం ప్రజలు వైసీపీ కి ఓట్లు వేసి ఎంపీటీసీ లను జడ్పీటీసీలను అభ్యర్థలను గెలిపించండి కోరారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru