Kurnool: కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత విజయ మనోహరి తీవ్ర ధ్వజం!
Kurnool: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Kurnool: కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత విజయ మనోహరి తీవ్ర ధ్వజం!
Kurnool: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మహిళల పట్ల చంద్రబాబు చిన్న చూపు చూపిస్తున్నారని మహిళలు అంటే కేవలం యంత్రాలగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలను కంటే ముప్పై వేలు నాలుగు పిల్లల్ని కంటే నలభై వేలు ఇస్తామని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని విమర్శించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూన్నారని.
ఉచిత బస్సు పేరుతో 16 సర్వీసు లోని కేవలం 5 సర్వీసులకు మాత్రం పరిమితి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామని బాబు మాట మర్చిపోయారని తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని ఎత్తి వేసేందుకు కూటమి ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను మహిళలు గుర్తించి తగిన బుద్ది చెప్పాలని ఎస్వీ విజయ మనోహరి సూచించారు.




