Pathikonda: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి కంగాటి శ్రీదేవమ్మ!

Pathikonda: పత్తికొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం, సన్మానం ఘనంగా నిర్వహించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 5 Oct 2026 4:03 PM IST
Pathikonda
X

Pathikonda: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి కంగాటి శ్రీదేవమ్మ!

Pathikonda: పత్తికొండలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, మాజీ కో-ఆప్షన్ సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కంగాటి శ్రీ దేవమ్మ మాట్లాడుతూ.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఫలితాలను పునరావృతం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించామని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలులో చోటుచేసుకున్న లోపాలను గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా అందేవి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రజలను అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు స్పష్టమవుతుందని అన్నారు.అనంతరం తాజా మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, మండల కన్వీనర్, అనుబంధ సంఘాల నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda