Dornala: దోర్నాలలో వైసీపీ నిరసన ర్యాలీ
Dornala: పెద్దదోర్నాల శివసదనం నుండి నటరాజ్ సర్కిల్ వరకు వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ.
Dornala: దోర్నాలలో వైసీపీ నిరసన ర్యాలీ
దోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల నేపథ్యంలో మండల పార్టీ కన్వీనర్ ఘంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో శివసదనం నుంచి నటరాజ్ సర్కిల్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టేందుకు ప్రయత్నించగా, ఎస్సై వెంకటరమణయ్య ఆధ్వర్యంలోని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




