Nandyal: వైయస్‌ఆర్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి!
Nandyal: వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Nandyal: వైయస్‌ఆర్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి!
Nandyal: వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో రాజశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
రాజశేఖర్ పార్టీ కోసం అందించిన సేవలను శోభన్‌బాబు స్మరించుకున్నారు. ఇటీవల డీఎస్సీ నియామకాలపై జరిగిన ఆందోళనల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజశేఖర్‌ను కోల్పోవడం పార్టీకి, దళిత సంఘాలకు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజశేఖర్ ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని శోభన్‌బాబు పేర్కొన్నారు. వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.




