Kodumur: లోకేష్ హామీలు ఏమయ్యాయి.. ఆదిమూలపు సతీష్
Kodumur: కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై కోడుమూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Kodumur: లోకేష్ హామీలు ఏమయ్యాయి.. ఆదిమూలపు సతీష్
Kodumur: కోడుమూరు లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు .ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో లో ఆంధ్రప్రదేశ్ లో డీజల్, పెట్రోల్ ధరలు పెంచబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తున్నది అని ప్రశ్నించారు.
ప్రజలను మభ్యపెట్టడానికి లోకేష్ బాబు కూడా పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచమని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు ఏమి అయింది లోకేష్ బాబు నిద్ర పోతున్నారా. పెంచిన ధరలు త్వరగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ నాగరాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు రమేష్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, లాయర్ ప్రభాకర్,సోమశేఖర్, తదితరులు పాల్గొనారు.




