Pedda Dornala: పెద్ద దోర్నాలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భారీ ర్యాలీతో నామినేషన్!

Pedda Dornala: పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన గుమ్మ ఎల్లయ్య ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు.

Srikanth Singam, Markapur
Published on: 22 Nov 2026 4:57 PM IST
Pedda Dornala
X

Pedda Dornala: పెద్ద దోర్నాలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భారీ ర్యాలీతో నామినేషన్!

మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గుమ్మ ఎల్లయ్య హడావుడిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శనగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా పెద్ద దోర్నాల చెక్‌పోస్ట్ సెంటర్‌లోని పోలేరమ్మ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి బాణాసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, జై జగన్ నినాదాల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి స్వర్ణ గ్రామం-1లోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ గుమ్మ ఎల్లయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur