Kurnool: హొళగుందలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల్తూరు గోవిందు ప్రచారం!
Kurnool: హొళగుంద మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల్తూరు గోవిందు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు.
Kurnool: హొళగుందలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల్తూరు గోవిందు ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల్తూరు గోవిందు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
వైస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల్తూరు గోవిందు మాట్లాడు తూ గతంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నా పథకాలు ప్రజలు మరిచిపోలేరు విద్య,వైద్యం , మహిళలు చేయూత, వృద్ధులు పింఛన్లు అమ్మ వడి మమల్ని పథకాలే గెలిపిస్తాయి అన్ని ధీమా వ్యక్తం చేశారు
ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలే తనకు కొండంత బలమని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పాల్తూరు గోవిందు తెలిపారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
5 తారీకు న్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, తనను జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించాలని పాల్తూరు గోవిందు ప్రజలను కోరారు.




