Markapuram: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ నామినేషన్!

Markapuram: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Oct 2026 10:10 AM IST
Markapuram
X

Markapuram: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ నామినేషన్!

Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆశీస్సులతో ఉదయం 11 గంటలకు మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 10:30 గంటలకు మార్కాపురంలోని తన స్వగృహమైన శ్రావణి హాస్పిటల్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని డాక్టర్ కనకదుర్గ కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM