Liver: లివర్ హెల్తీగా ఉండాలంటే.. ఈ 7 స్నాక్స్ మీ డైట్‌లో చేర్చాల్సిందే.!
Liver: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే కాలేయం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఏడు రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Liver: లివర్ హెల్తీగా ఉండాలంటే.. ఈ 7 స్నాక్స్ మీ డైట్‌లో చేర్చాల్సిందే.!
Liver: మారుతున్న జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడుతున్నారు. కాలేయం మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం చురుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 7 బెస్ట్ స్నాక్స్ గురించి వైద్యులు వివరించారు.
ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు డాక్టర్లు సూచించిన 7 అద్భుతమైన స్నాక్స్ ఇవే:
నట్స్, సీడ్స్: మంచి కొవ్వులు ఉండే బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజలను స్నాక్స్‌గా తీసుకోవాలి.
పనీర్, చీజ్: సాదా పనీర్ ముక్కలు లేదా చీజ్ స్టిక్స్ తినడం వల్ల లివర్‌కు అవసరమైన ప్రొటీన్ అందుతుంది.
అవకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే అవకాడో పండు కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గ్రీక్ యోగర్ట్: సాధారణ పెరుగు కంటే ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది లివర్‌కు చాలా మంచిది.
కూరగాయలు: నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయ ముక్కలు, ఆకుకూరలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఉడికించిన గుడ్లు: ఉడికించిన కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది.
సోయాబీన్స్: పచ్చి సోయాబీన్స్‌లో ఉండే పోషకాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేసి, ఈ 7 రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే లివర్ ఎప్పటికీ పదిలంగా, ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.




