Alarm Side Effects: బెడ్‌పై అలారిమ్ పెట్టుకొని పడుకుంటున్నారా.! రోగాలను పిలిచి మరీ ఆహ్వానించినట్టే..
Alarm Side Effects: బెడ్‌పై ఫోన్ అడారిమ్ పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, హైబీపీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Alarm Side Effects: బెడ్‌పై అలారిమ్ పెట్టుకొని పడుకుంటున్నారా.! రోగాలను పిలిచి మరీ ఆహ్వానించినట్టే..
Alarm Side Effects: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఉదయం అనుకున్న సమయానికి లేవడానికి ప్రతి ఒక్కరూ మొబైల్ అలారంపై ఆధారపడుతున్నారు. నిద్రలేవగానే ఫోన్ చేతికి అందేలా చాలా మంది తలదిండు దగ్గర లేదా బెడ్‌పైనే ఫోన్ ఉంచి పడుకుంటారు. అయితే ఇలా ఫోన్ బెడ్‌పై ఉంచుకుని అలారం పెట్టుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవికి అతి దగ్గరగా అలారం మోగగానే ఉలికిపాటుతో నిద్రలేవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ రకమైన హఠాత్పరిణామాలు శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని హెచ్చరికలు వస్తున్నాయి.
చెవికి దగ్గరగా అలారం మోగడం వల్ల ఆకస్మిక ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. నిద్రలో ఉన్న గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో ఈ ప్రమాదం మరింత అధికంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల మెదడుపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. రోజంతా ఏదో తెలియని చిరాకు, తలనొప్పి వేధించే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య సమస్యల బారిన పడి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే సాధారణ చెకప్‌లు, మందుల కోసం నెలకు వేలకు వేలు ఖర్చవుతుంది. దీర్ఘకాలిక గుండె లేదా బీపీ సమస్యలు తలెత్తితే ఈ వైద్య ఖర్చులు మరింత పెరుగుతాయి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఆర్థిక భారాన్ని, ఆరోగ్య ముప్పును సులభంగా నివారించవచ్చు. ఫోన్‌ను బెడ్‌కు దూరంగా ఉంచడం అలవర్చుకోవాలి.
అలారం సెట్ చేసే విధానంలో కూడా మార్పులు చేసుకోవడం ఉత్తమం. అకస్మాత్తుగా పెద్ద సౌండ్‌తో మోగే రింగ్‌టోన్‌కు బదులుగా చిన్న సౌండ్‌తో ప్రారంభమై క్రమంగా పెరిగే జెంటిల్ వేక్ అప్ రింగ్‌టోన్‌లను ఎంచుకోవాలి. దీనివల్ల శరీరం సహజసిద్ధంగా నిద్ర నుంచి మేల్కొంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ ప్రభావం నుంచి దూరంగా ఉండటానికి పడుకునే సమయంలో ఫోన్‌ను దూరంగా పెట్టడం మంచిది. ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రశాంతమైన ఉదయాన్ని సొంతం చేసుకోవచ్చు.




