Sugarcane Juice: సమ్మర్ స్పెషల్: దాహం తీర్చడమే కాదు.. చెరుకు రసంతో ఇన్ని అద్భుత ప్రయోజనాలా?
Sugarcane Juice: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి కామెర్ల నివారణ వరకు చెరుకు రసం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.
Sugarcane Juice: సమ్మర్ స్పెషల్: దాహం తీర్చడమే కాదు.. చెరుకు రసంతో ఇన్ని అద్భుత ప్రయోజనాలా?
Sugarcane Juice: భానుడి భగభగలకు విలవిల్లాడుతున్న జనులకు ప్రకృతి సిద్ధంగా లభించే పానీయాలు ఎంతో ఊరటనిస్తాయి. కొబ్బరిబొండం తర్వాత ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన పానీయంగా 'చెరుకు రసం' ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం దాహం తీర్చడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్‌లా చెరుకు రసం పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రదాయిని.. పోషకాల గని:
చెరుకు రసంలో విటమిన్ బి తో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సర్వశ్రేష్టమైన 'నేచురల్ టానిక్'గా పిలుస్తారు. తక్కువ ధరలో లభించే ఈ పానీయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు గ్లాసు చెరుకు రసం తాగితే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
చెరుకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరవు.
పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులకు చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తూ వ్యాధిని నియంత్రిస్తుంది.
చెరుకు రసంలో అల్లం రసం కలిపి తీసుకుంటే గొంతు గరగర తగ్గి, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎండ వల్ల కలిగే అలసట, వాంతులు మరియు వికారం వంటి సమస్యలకు చెరుకు రసం చక్కని పరిష్కారం.
ప్రతిరోజూ ఒక గ్లాసు చెరుకు రసాన్ని అలవాటు చేసుకుంటే వేసవి తాపం నుంచి తట్టుకోవడమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.




