Baby Care: చిన్న పిల్లలు కాయిన్ మింగితే వెంటనే ఏం చేయాలి.?
Baby Care: చిన్న పిల్లల సంరక్షణ చాలా బాధ్యతతో కూడిన పని. ముఖ్యంగా మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఏ వస్తువు కనిపించినా చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు నాణేలను మింగుతుంటారు. మరి ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Baby Care: చిన్న పిల్లలు కాయిన్ మింగితే వెంటనే ఏం చేయాలి.?
Baby Care: చిన్న పిల్లల సంరక్షణ చాలా బాధ్యతతో కూడిన పని. ముఖ్యంగా మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఏ వస్తువు కనిపించినా చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు నాణేలను మింగుతుంటారు. మరి ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లల సంరక్షణలో అప్రమత్తత అవసరం
పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక నిర్దిష్ట వయస్సు వరకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారం నుంచి దుస్తుల వరకు ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఎంపిక చేయాలి. మునుపటి కాలంలో పిల్లల సంరక్షణలో పెద్దలు మార్గదర్శనం చేసేవారు. కానీ ఇప్పుడు మైక్రో ఫ్యామిలీల కారణంతో చాలా కుటుంబాల్లో అలాంటి సహాయం లేకపోవడంతో కొత్తగా తల్లిదండ్రులైన వారు పిల్లలను ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు.
పిల్లలు ఏ వస్తువైనా నోట్లో పెట్టుకునే అలవాటు
పిల్లలు పెరుగుతున్న సమయంలో చేతిలో పడిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం సహజం. నేలపై ఉన్న చిన్న వస్తువులు, గోడల దగ్గర ఉన్న మట్టి వంటి వాటిని కూడా నోట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో చిన్న వస్తువులు నేలపై ఉండకుండా చూసుకోవాలి. పిల్లలు ఆడుకునే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
ఆహారం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం
పిల్లలకు ఆహారం ఇవ్వడం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారి వయస్సుకు తగిన ఆహారం మాత్రమే ఇవ్వాలి.
కొన్ని ఆహార పదార్థాలు లేదా చిన్న ముక్కలుగా ఉండే వస్తువులు పిల్లల గొంతులో లేదా శ్వాసనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు ఆహారం ఇస్తున్నప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉండి గమనించడం చాలా ముఖ్యం.
పిల్లలు నాణెం మింగితే ఏమి చేయాలి?
మూడు సంవత్సరాల లోపు పిల్లలకు నాణేలు, బటన్లు, చిన్న బ్యాటరీలు వంటి వస్తువులను చేతిలో ఇవ్వకూడదు. ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలు నాణెం లేదా చిన్న వస్తువును మింగితే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తే తక్షణమే వైద్య సహాయం అవసరం.
అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు
పిల్లలు మింగిన వస్తువు కారణంగా ఊపిరి ఆడకపోతే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. పిల్లల తలను కిందికి వంచాలి. రెండు భుజాల మధ్య భాగంలో మెల్లగా కానీ వేగంగా తట్టాలి. ఇలా చేయడం వల్ల నాణేం నోటిలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సమస్య తేలికంగా అనిపించినా వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు వెళ్లడం మంచిది.
గమనిక: చిన్న పిల్లల విషయంలో అస్సలు నిర్లక్ష్యంతో ఉండకూడదు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.




