Back Pain: నడుము నొప్పితో పాటు ఈ లక్షణాలు కూడానా? కిడ్నీ సమస్య కావొచ్చు
Back Pain: నడుము నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా అనిపిస్తుంది.
Back Pain: నడుము నొప్పితో పాటు ఈ లక్షణాలు కూడానా? కిడ్నీ సమస్య కావొచ్చు
Back Pain: నడుము నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది కేవలం మసిల్స్ సమస్య కాకుండా కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావడొచ్చు. అందుకే శరీరం ఇచ్చే చిన్న చిన్న సూచనలను గమనించడం చాలా అవసరం.
నడుము నొప్పి ఎప్పుడు ప్రమాదం.?
సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం, తప్పు పొజిషిన్ లేదా తప్పుడు విధానంలో వ్యాయామం చేయడం వల్ల నడుము నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ కిడ్నీ సమస్యల వల్ల వచ్చే నొప్పి మాత్రం వేరుగా ఉంటుంది. ఇది లోతుగా అనిపిస్తుంది, సులభంగా తగ్గదు, శరీరం కదిలినా పెద్దగా మార్పు ఉండదు. ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త అవసరం.
* మసిల్స్ నొప్పి అయితే నొప్పి కదలికలతో పెరుగుతుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. వేడి గుడ్డతో కాపడం లేదా స్ట్రెచింగ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
* కిడ్నీ నొప్పి అయితే.. నొప్పి లోపల నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. కదిలినా పెద్దగా మార్పు ఉండదు. విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యల ముఖ్య లక్షణాలు కిడ్నీ వ్యాధులు ప్రారంభంలో పెద్దగా లక్షణాలు చూపవు. కానీ కొన్ని చిన్న మార్పులు కనిపిస్తాయి.
మూత్ర విసర్జనలో మార్పులు
మూత్రం రంగు గాఢంగా మారడం, మూత్రం చేసేటప్పుడు మంటగా ఉండడం, కళ్ల చుట్టూ లేదా కాళ్ల వద్ద వాపు, నిరంతర అలసట, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికలను గుర్తించండి కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా కనిపించినా, అవి పెద్ద సమస్యకు సూచన కావచ్చు. నురుగు లాంటి మూత్రం రావడం, బ్లాడర్ పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన కలగడం, రక్తపోటులో మార్పులు రావడం వంటి వాటిని కూడా లైట్ తీసుకోకూడదు.
గమనిక: ఈ వివరాలు వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను నేరుగా సంప్రదించడమే మంచిది




