Health Update: 30 ఏళ్లు దాటాక శరీరంలో కనిపించే మార్పులు ఇవే.! వైద్యులు ఏమన్నారంటే.?

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. అయితే 30 ఏళ్ల తర్వాత కండరాల బలం, ఎముకల సాంద్రత తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

Ravi
By Ravi
Published on: 19 Oct 2026 9:16 PM IST
Health Update
X

Health Update: 30 ఏళ్లు దాటాక శరీరంలో కనిపించే మార్పులు ఇవే.! వైద్యులు ఏమన్నారంటే.?

Health Update: వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. అయితే 30 ఏళ్ల తర్వాత కండరాల బలం అలాగే ఎముకల సాంద్రత తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. చర్మంలో కొల్లాజెన్ తగ్గి ముడతలు మొదలవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. బాడీలో నీటి శాతం, గాఢ నిద్ర తగ్గడం, అలాగే ఇన్ఫ్లమేషన్, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం వంటి మార్పులు జరుగుతాయని వివరిస్తున్నారు. హెల్దీ అలవాట్లతో వీటిని అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

శరీరంలో వచ్చే ఈ మార్పులను ముందస్తుగా గుర్తించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా వయసురీత్యా వచ్చే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం అలాగే ప్రశాంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. నిపుణుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.