Egg: రోజుకు మూడు గుడ్లు తిన్నారంటే...ఏమౌతుందో తెలుసా?

Egg: ప్రతిరోజూ మూడు గుడ్లు తినడం వల్ల ప్రోటీన్, పోషకాలు లభించి శరీర ఆరోగ్యం, మెదడు పనితీరు, బరువు నియంత్రణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Ramya Thota
Published on: 24 April 2026 12:07 PM IST
Egg
X

Egg

Healthy Diet:రోజు ఏదైనా కానీవ్వండి ప్రతిరోజూ గుడ్లు తినండి అంటూ వైద్యులు చెబుతున్నారు.గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలైనవి అని చెప్పవచ్చు.మిగతా కాలలతో పోల్చుకుంటే వేసవి కాలం చాలా మంది గుడ్లు తినడానికి కొంత అయిష్టం చూపుతుంటారు.ఎండాకాలంలో గుడ్లు తింటే సరిగా ఆరగదని అనుకుంటుంటారు.అయితే, ప్రతిరోజూ మూడు గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.

ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఒక గొప్ప మార్పును తీసుకుని వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు ఒక "మల్టీవిటమిన్" లాంటివి, ఇవి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజూ మూడు గుడ్లు తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

ప్రతిరోజూ మూడు గుడ్లు తినడం వల్ల మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది మెరుగైన జీవక్రియ కోసం 18 గ్రాముల సంపూర్ణ ప్రోటీన్‌ను అందిస్తుంది. గుడ్డు పచ్చసొనలోని కోలిన్, కాలేయం విషపదార్థాలను తొలగించడానికి, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, LDL కొలెస్ట్రాల్ నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటిచూపును మెరుగుపరిచి, ముడతలను నివారిస్తాయి. కేవలం 30 రోజులు దీనిని ప్రయత్నిస్తే చాలు,మన శరీరంలోని మార్పులు మనకే కనపడతాయని వైద్యులు అంటున్నారు.

గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.గుడ్డు సొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కోలిన్ లోపం ఏకాగ్రత లోపానికి దారితీస్తుంది, దీనిని ప్రతిరోజూ మూడు గుడ్లు తినడం ద్వారా పరిష్కరించవచ్చు.

బరువు నిర్వహణ:

గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది, ఇది మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story