Health Tips: రాత్రిపూట మటన్ తింటున్నారా.? అయితే మీ బాడీ డ్యామేజే.!

Health Tips: రాత్రి పూట తినే ఆహారం పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 23 Jun 2026 7:49 PM IST
Health Tips
X

Health Tips: రాత్రిపూట మటన్ తింటున్నారా.? అయితే మీ బాడీ డ్యామేజే.!

Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి సరైన సమయానికి భోజనం చేసే అలవాటు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా తినడంతో పాటు, నచ్చిన జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కొనితెచ్చు కుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రాత్రి పూట తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వులు, క్యాలరీలు భారీగా చేరి బరువు విపరీతంగా పెరుగుతారని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. రాత్రి సమయంలో మనం తినే ఆహారం తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలే తప్ప, మన జీర్ణవ్యవస్థపై భారం మోపేలా అస్సలు ఉండకూడదు.

వైద్యుల సూచనల ప్రకారం రాత్రి పూట అస్సలు తీసుకోకూడని ఆహార పదార్థాలు:

తీపి పదార్థాలు: చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీమ్, కేక్స్ లాంటివి రాత్రి సమయంలో పూర్తిగా మానేయాలని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. వీటిలో ఉండే అధిక చక్కెరలు రాత్రి సమయంలో కరగకుండా శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి.

జంక్ ఫుడ్స్, పానీయాలు: బర్గర్లు, పిజ్జాలు లాంటి జంక్ ఫుడ్స్‌తో పాటు, ఎనర్జీ డ్రింక్స్, టీ, కాఫీలు అస్సలు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

మాంసాహారం: ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, మటన్ లాంటివి రాత్రి పూట తీసుకుంటే అజీర్తి సమస్య ఏర్పడవచ్చని వైద్యులు చెబుతున్నారు.

రాత్రి సమయంలో మన శరీర అవయవాల పనితీరు సాధారణం కంటే కాస్త నెమ్మదిస్తుంది. కాబట్టి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే స్పైసీ ఫుడ్ జోలికి అస్సలు పోవద్దని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం కోసం రాత్రి వేళల్లో సాధ్యమైనంత వరకు తక్కువగా, తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story