Diabetes Control Tips: డయాబెటిస్‌కు రామబాణం: మజ్జిగలో ఈ గింజలు కలిపి తాగండి.. షుగర్ లెవల్స్ మటాష్!
Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నారా? రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి మజ్జిగలో సబ్జా గింజలు కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Chia Seeds With Buttermilk: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు ప్రతి ఇంట్లోనూ డయాబెటిస్ (మధుమేహం) రోగులు కనిపిస్తున్నారు. శరీరంలోని క్లోమ గ్రంథి (Pancreas) తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి. అయితే, దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఖరీదైన మందులతో పాటు మన వంటింటి చిట్కాలు కూడా అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మజ్జిగ + సబ్జా గింజలు: ఒక అమృతం
రక్తంలో గ్లూకోజ్ సాంద్రతను తగ్గించడంలో ఒక గ్లాసు మజ్జిగ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మజ్జిగలో ఒక చెంచా సబ్జా గింజలు (లేదా చియా గింజలు) కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు రెండు రెట్లు వేగంగా నియంత్రణలోకి వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎలా పనిచేస్తుంది?
సబ్జా గింజలు శరీరంలో ఇన్సులిన్ పనితీరును (Sensitivity) మెరుగుపరుస్తాయి. దీనివల్ల కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహిస్తాయి.
భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా (Spikes) ఇవి నిరోధిస్తాయి.
సబ్జా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్-2 డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను అరికడతాయి.
బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
మధుమేహానికి ప్రధాన కారణాలైన ఊబకాయం (Obesity), చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చియా గింజలు ఎంతో సహకరిస్తాయి. వీటిలో ఉండే శోథ నిరోధక (Anti-inflammatory) లక్షణాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
నిపుణుల సూచన: మందులు వాడుతున్న వారు కూడా ఈ సహజ సిద్ధమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఇలాంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను శాశ్వతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.




