Health Tips: డిప్రెషన్ వల్ల అతిగా తినేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
Health Tips: మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ కారణంగా చాలామంది తెలియకుండానే అతిగా తింటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: డిప్రెషన్ వల్ల అతిగా తినేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
Health Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి సర్వసాధారణ సమస్యలుగా మారాయి. అయితే, ఈ డిప్రెషన్ అనేది కేవలం మానసిక ఆరోగ్యంపైనే కాకుండా మన ఆహారపు అలవాట్లపై కూడా తీవ్రమైన, ప్రతికూల ప్రభావం చూపుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
డిప్రెషన్ బారిన పడినప్పుడు చాలామందిలో విచారం, విపరీతమైన నీరసం, ఏ పని మీదా ఆసక్తి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడే క్రమంలో కొందరు తెలియకుండానే జంక్ ఫుడ్ లేదా ఇతర ఆహార పదార్థాలను అతిగా తింటుంటారు. ఇలా కడుపు నిండినా కూడా విపరీతంగా తినడాన్ని వాళ్లు ఒక తాత్కాలిక ఉపశమనంగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఒత్తిడిని జయించడానికి ఇలా అతిగా తినడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఇది దీర్ఘకాలంలో 'ఈటింగ్ డిజార్డర్' లాంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం వంటి ఇతర జీవనశైలి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ సమస్యను అదుపు చేయాలంటే ముందుగా రోజువారీ జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా అసలు డిప్రెషన్‌కు కారణమైన విషయాలను గుర్తించి, వాటిని పరిష్కరించుకోవడం ద్వారా ఈ అతిగా తినే అలవాటును సులభంగా జయించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ సహాయం తీసుకోవడం కూడా మంచిది.




