Health Tips: ఆఫీసుల్లో తెగ కాఫీ తాగేస్తున్నారా.? ఆ రోగాన్ని రారమ్మన్నట్టే..
Health Tips: ఆఫీసుల్లో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి పదేపదే కాఫీ తాగే అలవాటు మీకు ఉందా? అయితే మీరు కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే!
Health Tips: ఆఫీసుల్లో తెగ కాఫీ తాగేస్తున్నారా.? ఆ రోగాన్ని రారమ్మన్నట్టే..
health tips: కార్పొరేట్ ఆఫీసుల్లో, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడిని జయించడానికి ముందుగా గుర్తొచ్చేది 'కాఫీ'. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తూ, ఆ అలసటను, నిద్రమత్తును వదిలించుకోవడానికి చాలామంది రోజుకు కప్పుల కొద్దీ కాఫీలు తెగ తాగేస్తుంటారు. అయితే, ఆఫీసులో ఇలా మితిమీరి కాఫీ తాగే అలవాటు ఉన్నవారు.
కచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక టెక్కీ ఎదుర్కొన్న వింత సమస్య, కాఫీ ప్రియులందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. పని ఒత్తిడి పేరుతో మోతాదుకు మించి కెఫిన్ తీసుకుంటే అది ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో మీరే చూడండి.
వివరాల్లోకి వెళితే.. ఆఫీసులో ఉండే విపరీతమైన పని ఒత్తిడిని తట్టుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన ఆ టెక్కీ వారమంతా, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఆఫీసులో కనీసం 3 నుంచి 4 కప్పుల స్ట్రాంగ్ కాఫీ తాగేవాడు. అయితే, వీకెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కాఫీ తాగే అలవాటును పూర్తిగా పక్కనపెట్టేవాడు. ఇలా చేయడం వల్ల ప్రతి వీకెండ్‌లో అతనికి విపరీతమైన తలనొప్పి రావడం మొదలైంది.
ఏమైందో అర్థంకాక ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, అసలు విషయం బయటపడింది. వారమంతా క్రమం తప్పకుండా శరీరానికి ఎక్కువ మోతాదులో కెఫిన్ అందించి, సెలవు రోజుల్లో అకస్మాత్తుగా దానిని ఆపేయడం వల్లే అతనికి ఇలాంటి తీవ్రమైన తలనొప్పి వస్తోందని వైద్యులు స్పష్టం చేశారు. వైద్య పరిభాషలో దీనిని 'కెఫిన్ విత్‌డ్రాయల్' లక్షణంగా నిపుణులు గుర్తించారు.
రోజువారీగా కాఫీ లేదా టీల ద్వారా శరీరానికి కెఫిన్ అలవాటు పడిన తర్వాత, దాన్ని ఒక్కసారిగా మానేస్తే మెదడులోని రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి ఇలాంటి విపరీతమైన తలనొప్పులు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. తలనొప్పితో పాటు విపరీతమైన అలసట, ఎవరికైనా చిరాకు రావడం, ఏకాగ్రత లోపించడం కూడా ఈ కెఫిన్ విత్‌డ్రాయల్ లక్షణాల్లో భాగమే.
కాబట్టి ఎవరైనా కాఫీ తాగడం తగ్గించుకోవాలనుకుంటే, అకస్మాత్తుగా కాకుండా మెల్లమెల్లగా రోజుకు ఒక కప్పు చొప్పున ఆ మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఆఫీసులో ఒత్తిడి లేదా నీరసంగా అనిపించినప్పుడు కాఫీకి బదులుగా మంచినీళ్లు తాగడం, గ్రీన్ టీ తీసుకోవడం, లేదా కాసేపు బయట నడవడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవడం ఎంతో ఉత్తమం. మీరు కూడా వీకెండ్స్‌లో ఇతనిలాగే తలనొప్పికి గురవుతుంటే, ఒకసారి మీ కాఫీ అలవాటును చెక్ చేసుకోవడం మంచిది.




