Alert Married Men: పెళ్లయిన మగాళ్లకు అలర్ట్.. ఈ ఆహారంతో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్!
Alert Married Men: రోజువారీ ఆహారంలో పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా? పురుషుల్లో సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ మరియు ఆరోగ్యంపై ఊరగాయలు చూపించే ప్రతికూల ప్రభావాల గురించిన పూర్తి వివరాలు.
Alert Married Men: పెళ్లయిన మగాళ్లకు అలర్ట్.. ఈ ఆహారంతో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్!
Alert Married Men: ఉదయమే హడావుడిగా ఉద్యోగాలకు వెళ్లే పురుషులు తరచుగా తమ ఆహారం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. పెళ్లయిన పురుషులు కుటుంబ బాధ్యతల ఒత్తిడిలో పడి వేళకు పోషకాహారం తీసుకోకపోవడంతో పాటు శారీరక బలహీనతలకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే త్వరగా అయిపోతుందనో లేదా రుచిగా ఉందనో రోజువారీ భోజనంలో పచ్చళ్లు (ఊరగాయలు) ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటారు. అయితే, ప్రతిరోజూ అధికంగా పచ్చళ్లు తినడం వల్ల పురుషుల ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా మార్కెట్‌లో లభించే పచ్చళ్లలో వాడే మసాలా దినుసులను సరైన పద్ధతిలో ఆరబెట్టకపోవడం, అలాగే నిల్వ ఉండటానికి అధిక మొత్తంలో నూనె మరియు ఉప్పును వాడటం జరుగుతుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను విపరీతంగా పెంచుతాయి. ముఖ్యంగా అధిక కారం, మసాలాలు ఉన్న ఊరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ నాణ్యతను తీవ్రంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మామిడికాయ పచ్చడి ప్రియులు ప్రధానంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. వీటి తయారీ మరియు పంట దశల్లో నిల్వ కోసం వాడే ప్రిజర్వేటివ్‌లలో 'ఎసిటామిప్రిడ్' అనే కెమికల్ మూలకం ఉండటం వల్ల ఇది పురుష పునరుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఊరగాయలలోని రసాయనిక నిల్వ పదార్థాలు ఈ ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
రోజువారీగా నిల్వ ఉంచిన ఊరగాయలను తినడం వల్ల కేవలం సంతానోత్పత్తి సమస్యలే కాకుండా.. కడుపులో మంట మరియు గ్యాస్ సమస్యలు, అల్సర్లు, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
అప్పుడప్పుడు రుచి కోసం పచ్చళ్లు తిన్నా పర్వాలేదు కానీ, రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవడం తక్షణమే స్వస్తి చెప్పాలి. సంపాదించిన దానంతా అనారోగ్యం పాలై ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి, పురుషులు తమ దినచర్యలో సమతుల్యమైన, పోషకాలతో కూడిన తాజా ఆహారాన్ని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ డైట్‌లో ఏదైన మార్పులు చేయాలనుకుంటే మీ పర్సనల్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.




