Health Tips: ఒక్క రాత్రి తక్కువ నిద్రపోతే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: చాలా రకాల ఆరోగ్య సమస్యలకు సరైన సమయం నిద్రపోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Ravi
By Ravi
Published on: 30 Jun 2026 6:30 PM IST
Health Tips
X

Health Tips: ఒక్క రాత్రి తక్కువ నిద్రపోతే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: మనిషి ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే ప్రతిరోజూ కంటినిండా నిద్ర చాలా అవసరం. అయితే నేటి బిజీ లైఫ్‌స్టైల్‌, స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల చాలామంది నిద్రను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 'ఒక్క రాత్రే కదా సరిగ్గా నిద్రపోకపోయినా పర్వాలేదులే' అని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ, అలా చేయడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కనీసం ఒక్క రాత్రి తక్కువ నిద్రపోయినా లేదా అస్సలు నిద్రపోకపోయినా శరీరంలో ఈ కింది నష్టాలు జరుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలక విధులకు ఆటంకం: రాత్రివేళ విశ్రాంతి లేకపోవడం వల్ల మరుసటి రోజు శరీరంలో జరిగే అనేక కీలక విధులకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది.

మెదడు పనితీరుపై ప్రభావం: నిద్రలేమి కారణంగా మెదడు పనితీరు మందగిస్తుంది. ఆలోచనా శక్తి తగ్గిపోయి, చేసే పని మీద ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది. జీర్ణవ్యవస్థ సమస్యలు: సరైన నిద్ర లేకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

హార్మోన్ల అసమతుల్యత: శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలై, బరువు పెరగడానికి దారితీస్తుంది.

మానసిక ఇబ్బందులు: ఒక్క రోజు నిద్రపోకపోయినా మరుసటి రోజంతా విపరీతమైన అలసట, నీరసం వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న విషయానికీ చిరాకు, కోపం రావడం వంటి మానసిక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story