Egg: కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత గుడ్డో.! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Egg: కోడిగుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహతో పాటు గుడ్డు గురించి పలు నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
Egg: కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత గుడ్డో.! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Egg: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లకు సంబంధించి అనేక రకాల సందేహాలు నిత్యం రకరకాల మాధ్యమాలలో చలామణి అవుతుంటాయి. ముఖ్యంగా ప్రతిరోజూ మనం ఆహారంలో భాగం చేసుకునే కోడిగుడ్డు గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుందని, బరువు పెరుగుతారని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఈ అపోహలలో ఎంతవరకు నిజం ఉందనే విషయాలపై వైద్య నిపుణులు స్పష్టమైన వివరణలు ఇస్తున్నారు. కోడిగుడ్డు తినడం వల్ల కలిగే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మొదటిగా గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ నిపుణుల ప్రకారం రోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి మేలు చేసే గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే రెండవ అపోహ ఏమిటంటే ప్రెగ్నెంట్ మహిళలు గుడ్లు తినకూడదనే ప్రచారం ఉంది. ఇందులో ఎలాంటి నిజం లేదు. గర్భిణులు ధైర్యంగా గుడ్లు తినవచ్చు. దీనివల్ల గర్భంలోని బిడ్డ మెదడు ఎదుగుదల చాలా బాగుంటుంది. పోషకాలు అంది ఆరోగ్యకరమైన పుట్టుకకు ఇది సహకరిస్తుంది.
మూడవదిగా కేవలం ఎగ్ వైట్ మాత్రమే తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎగ్ ఎల్లోలో కూడా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఎగ్ వైట్ తో పాటు పచ్చసొన తినడం వల్ల మెదడు, కళ్లు, హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇక నాలుగోది గుడ్లు తింటే బరువు పెరుగుతారా అనే అపోహ ఉంది. గుడ్లు తినడం వల్ల బరువు పెరగడం జరగదు. ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును కరిగించడానికి గుడ్లు ఎంతగానో సహాయపడతాయి.
సాధారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు వస్తే మందుల కోసం ప్రతీ నెలా ఖర్చు చేస్తుంటారు. కానీ రోజూ ఒక కోడిగుడ్డు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముందే నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పౌష్టికాహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. రోజూ గుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి. అపోహలను నమ్మకుండా శాస్త్రీయ నిజాలను తెలుసుకుని ఆహారపు అలవాట్లను పాటించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలని వైద్యులు సూచిస్తున్నారు.




