అదే పనిగా రీల్స్ స్క్రోల్ చేస్తున్నారా? మీ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
Endless Scrolling: ప్రస్తుతం చాలా మంది గంటలకొద్దీ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకో వీడియో.. ఇంకో వీడియో అంటూ గంటలతరబడి ఫోన్‌ను చూస్తున్నారు.
అదే పనిగా రీల్స్ స్క్రోల్ చేస్తున్నారా? మీ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
Endless Scrolling: ప్రస్తుతం చాలా మంది గంటలకొద్దీ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకో వీడియో.. ఇంకో వీడియో అంటూ గంటలతరబడి ఫోన్‌ను చూస్తున్నారు. అయితే ఇది కేవలం టైమ్ వేస్ట్ మాత్రమే కాదు, మన మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.?
ఎండ్లెస్ స్క్రోలింగ్ అంటే ఏమిటి?
ఎండ్లెస్ స్క్రోలింగ్ అంటే ఫోన్‌లో సోషల్ మీడియా లేదా షార్ట్ వీడియోలు ఆపకుండా చూస్తూ ఉండటం. ఒకటి తర్వాత ఒకటి వీడియోలు వస్తుండటంతో మనం ఆగకుండా చూస్తూనే ఉంటాం. ఇది మొదట్లో సరదాగా అనిపించినా, నెమ్మదిగా అలవాటుగా మారిపోతుంది. రోజుకు కొద్దిసేపు అనుకున్నది గంటల సమయంగా మారిపోతుంది.
షార్ట్ వీడియోలు ఎలా ఆకట్టుకుంటాయి?
షార్ట్ వీడియోలను చాలా వేగంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఫాస్ట్ కట్స్, కలర్‌ఫుల్ విజువల్స్, సడన్ సీన్స్ ఇలా అన్నీ కలిపి మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. ఈ వీడియోలు తక్కువ టైంలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. అందుకే మనం ఒకటి చూసిన తర్వాత ఇంకోటి చూడాలని అనిపిస్తుంది.
మెదడుపై పడే ప్రభావం
ఎక్కువగా స్క్రోలింగ్ చేసే వాళ్లలో ఫోకస్ తగ్గిపోతుంది. ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. పరిశోధనల ప్రకారం, ఇలా షార్ట్ వీడియోలకు అలవాటు పడినవాళ్ల మెదడు లోతుగా ఆలోచించడానికి కాస్త కష్టపడుతుంది. అంటే ఏకాగ్రత తగ్గిపోతుంది.
అలవాటు ఎలా పెరుగుతుంది?
షార్ట్ వీడియోలు మనలో వెంటనే రియాక్షన్ తెప్పిస్తాయి. నవ్వు, ఆశ్చర్యం, ఎమోషన్. అదే మనల్ని మరిన్ని వీడియోలు చూడటానికి ప్రోత్సహిస్తుంది. ఇలా కొద్దికొద్దిగా మన మెదడు వేగంగా మారే కంటెంట్‌కే అలవాటు పడుతుంది. ఫలితంగా పెద్ద వీడియోలు లేదా చదవాల్సిన విషయాలపై ఆసక్తి తగ్గుతుంది.
దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు
ఈ అలవాటు వల్ల సహనం తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మనం బోర్ ఫీల్ అవుతాం. ముఖ్యంగా ఒక పనిని పూర్తి చేసే వరకు ఫోకస్ ఉండదు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే మెదడు త్వరగా మారే కంటెంట్‌కు అలవాటు పడిపోతుంది.
ఎండ్లెస్ స్క్రోలింగ్ చిన్న అలవాటు లాగా అనిపించినా, దీని ప్రభావం పెద్దది. కాబట్టి ఫోన్ వినియోగాన్ని కాస్త నియంత్రించడం, సమయం కేటాయించడం మంచిది. ఇలా చేస్తే మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.




