Health: జ్యూస్ మంచిదా, పండ్లు తిన‌డం మంచిదా.? వైద్యుల స‌ల‌హా ఏంటంటే.

Health: చాలామంది ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుందని అనుకుంటారు. కానీ డాక్టర్లు మాత్రం జ్యూస్ కంటే నేరుగా పండ్లు తినాలని సూచిస్తారు. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mokshith
Published on: 21 March 2026 12:14 PM IST
Health
X

Health: జ్యూస్ మంచిదా, పండ్లు తిన‌డం మంచిదా.? వైద్యుల స‌ల‌హా ఏంటంటే.

Health: చాలామంది ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుందని అనుకుంటారు. కానీ డాక్టర్లు మాత్రం జ్యూస్ కంటే నేరుగా పండ్లు తినాలని సూచిస్తారు. దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యూస్‌లో ప్ర‌ధాన స‌మస్య ఇదే

పండ్లలో సహజంగా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ జ్యూస్ త‌యారు చేసే స‌మ‌యంలో ఎక్కువ ఫైబర్ తొలగిపోతుంది, మిగిలేది తీపి ద్రవం మాత్రమే, అందుకే జ్యూస్ కంటే పండ్లు తినడం మంచిది. పండ్ల‌లోని ఫైబర్ ఎక్కువ‌గా తొక్క‌ల్లోనే ఉంటుంది.

బ్లడ్ షుగర్ త్వరగా పెరుగుతుంది

స‌హ‌జంగా జ్యూస్ తాగితే చక్కెర త్వరగా రక్తంలో కలుస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. కొన్ని అధ్య‌యనాల ప్రకారం రోజూ ఫ్రూట్ జ్యూస్ తాగితే టైప్-2 డయాబెటిస్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ జ్యూస్‌ల‌లో అద‌నంగా చ‌క్క‌ర క‌లప‌డం కూడా స‌మ‌స్య‌కు కార‌ణంగా చెప్పొచ్చు.

పండ్లలోనే పూర్తి పోషకాలు

పండ్ల తొక్క, గుజ్జులో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఉదాహరణకు యాపిల్, పియర్ తొక్కలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అదే జ్యూస్ చేసుకొని తాగితే ఇవి చాలావరకు తగ్గిపోతాయి. అందుకే పండ్లు తింటే పూర్తి పోషకాలు లభిస్తాయి.

బరువు నియంత్రణకు పండ్లు బెస్ట్

పండ్లు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది. అదే జ్యూస్ అయితే ఎక్కువ కాలరీలు ఉండొచ్చు. తెలియకుండా ఎక్కువ తాగేస్తారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

గట్ హెల్త్, దంతాలకు మంచిది

పండ్లలోని ఫైబర్ మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. దీంతో గట్ హెల్త్ మెరుగుపడుతుంది. అలాగే

పండ్లు నమలడం వల్ల లాలాజలం పెరుగుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. జ్యూస్‌లో ఉన్న చక్కెర, ఆమ్లాలు దంతాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం కోసం మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు వైద్యుల సూచ‌న‌లే పాటించాలి.

Mokshith

Mokshith

Next Story