Health Tips: మీ చర్మం సహజంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి..! నిపుణుల సూచనలు..

Health Tips: మెరిసే చర్మం కోసం సరైన పోషకాహారం తీసుకోవాలని స్కిన్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 8 Sept 2026 10:26 PM IST
Health Tips
X

Health Tips: మీ చర్మం సహజంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి..! నిపుణుల సూచనలు..

Health Tips: చర్మ సౌందర్యం అనగానే చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, లోషన్ల వైపు పరుగులు తీస్తుంటారు. అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ నెలకు కనీసం రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు వరకు వృథాగా ఖర్చు చేస్తుంటారు. కొందరైతే లేజర్ ట్రీట్‌మెంట్లు, స్కిన్ వైటెనింగ్ థెరపీల పేరుతో సులభంగా రూ. 1 లక్ష వరకు వెచ్చిస్తుంటారు. కానీ బాహ్య లేపనాలు కేవలం తాత్కాలిక మెరుపును మాత్రమే ఇస్తాయని, అంతర్గతంగా తీసుకునే పోషకాహారమే చర్మానికి శాశ్వత సౌందర్యాన్ని ప్రసాదిస్తుందని ప్రముఖ స్కిన్ స్పెషలిస్టులు స్పష్టం చేస్తున్నారు. మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యంతో పాటు చర్మ కాంతిని నిర్ణయిస్తుంది. బయట దొరికే రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది.

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ పాత్ర ఎంతో కీలకం. శాఖాహారులు తమ డైట్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉండే రాజ్మా, చోలే, శనగలు లాంటి గింజ ధాన్యాలను విధిగా చేర్చుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు చర్మ కణాలకు కొత్త జీవం పోస్తాయి. ముఖ్యంగా గింజ ధాన్యాల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. వీటితో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యాప్సికమ్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం సాగకుండా గట్టిగా ఉండటానికి ఈ కొల్లాజెన్ ఎంతో అవసరం. ఇక నాన్-వెజిటేరియన్స్ ప్రతిరోజూ కనీసం ఒక కోడిగుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి. గుడ్డులో ఉండే అత్యుత్తమ అమైనో ఆమ్లాలు చర్మ కణాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణాల మరమ్మతుకు ఎంతగానో తోడ్పడతాయి.

చర్మం ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలంటే ముందుగా శరీరంలో రక్తశుద్ధి జరగడం ఎంతో అవసరం. రక్తం శుద్ధి అయితే ముఖంపై వచ్చే మొటిమలు, నల్లటి మచ్చలు వాటంతట అవే తగ్గిపోతాయి. దీనికోసం ప్రతిరోజూ ఉదయాన్నే బీట్‌రూట్, క్యారెట్లను కేవలం జ్యూస్‌లా కాకుండా గుజ్జుతో సహా తీసుకోవడం ఎంతో మంచిది. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్ శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేసి చర్మానికి కొత్త నిగారింపును తీసుకువస్తుంది. ఇది రక్తంలోని మలినాలను పూర్తిగా తొలగించి సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది. అలాగే క్యారెట్‌లోని బీటా కెరోటిన్ ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ఛాయలు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ వాడటం వల్ల చర్మం ఎంతో ప్రకాశవంతంగా మారుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

వీటితో పాటు జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ముఖంలో కల ఉట్టిపడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలు ఉంటే ఆ ప్రభావం నేరుగా ముఖంపై కనబడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు జీలకర్ర, వాము, సోంపు వేసి బాగా మరగబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అద్భుతమైన డిటాక్స్ వాటర్ శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి ఆహారంతో పాటు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. కేవలం మార్కెట్ ఉత్పత్తులపైనే ఆధారపడకుండా, ఇలాంటి సహజసిద్ధమైన ఇంట్లో దొరికే ఆహార నియమాలు పాటిస్తే చర్మం ఎప్పటికీ మృదువుగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఆచరించగలిగే ఈ పద్ధతుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story