Summer Cooling Tips: సమ్మర్‌లో బాడీ కూల్‌గా ఉంచే నేచురల్ డ్రింక్ ఇదే..!

గోంద్ కతీరా వేసవిలో శరీర వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. వడదెబ్బ, మలబద్ధకం తగ్గించేందుకు దీని ఉపయోగాలు తెలుసుకోండి.

Ramya Vegirouthu
Published on: 16 April 2026 4:22 PM IST
Gond Katira Benefits Summer Cooling Remedy Guide
X

Gond Katira Benefits Summer Cooling Remedy Guide

Gond Katira Benefits : ఎండాకాలం వేడి రోజురోజుకీ పెరుగుతుండటంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం, నీరసం, మలబద్ధకం, వడదెబ్బ వంటి సమస్యలు సాధారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహజసిద్ధమైన మార్గాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సహజ పరిష్కారాల్లో ఒకటిగా “గోంద్‌ కతీరా” ప్రాముఖ్యత సంతరించుకుంటోంది.

బాదం గోంద్‌ కతీరా అనేది చెట్టు నుంచి వచ్చే సహజ జిగురు పదార్థం. ఇది గట్టిగా ఉండే చిన్న ముక్కల రూపంలో లభిస్తుంది. దీనిని నీటిలో నానబెట్టగానే జెల్లీలా ఉబ్బిపోతుంది. ఈ జెల్లీ శరీరానికి చల్లదనాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గోంద్‌ కతీరా వినియోగం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్‌ కారణంగా మలబద్ధకం సమస్య తగ్గుతుందని పేర్కొంటున్నారు. అదనంగా శరీరంలో నీరసం తగ్గించి తక్షణ శక్తిని అందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మూత్రంలో మంట, శరీర వేడి వల్ల వచ్చే అసౌకర్యాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేసి మొటిమలను తగ్గించడంలో తోడ్పడుతుందని సమాచారం.

తయారీ విధానం కూడా చాలా సులభం. గోంద్‌ కతీరాను రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి అది జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీని తీసుకుని చల్లటి పాలలో లేదా నన్నారి షర్బత్‌, నిమ్మరసంలో కలిపి తీసుకోవచ్చు. చియా సీడ్స్‌, పటిక బెల్లం కలిపితే రుచికరంగా ఉంటుంది.

అయితే దీనిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. గోంద్‌ కతీరాను వేడి చేయకుండా చల్లగానే తీసుకోవాలి. దీనిని తీసుకున్న రోజుల్లో ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది. సాధారణ గోంద్‌ మరియు గోంద్‌ కతీరా మధ్య తేడా ఉండేందున కొనుగోలు సమయంలో సరైనది ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తంగా చూస్తే వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు, సహజసిద్ధంగా ఆరోగ్యాన్ని కాపాడేందుకు గోంద్‌ కతీరా ఒక మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story