Gym: ఒక్క‌సారి జిమ్‌కి వెళ్ల‌డం మానేస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Gym: ప్ర‌స్తుతం ఫిట్‌నెస్‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. చాలా మంది జిమ్‌కి వెళ్తున్నారు.

Mokshith
Published on: 16 April 2026 12:31 PM IST
Gym
X

Gym: ఒక్క‌సారి జిమ్‌కి వెళ్ల‌డం మానేస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Gym: ప్ర‌స్తుతం ఫిట్‌నెస్‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. చాలా మంది జిమ్‌కి వెళ్తున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల శరీరం బలంగా ఉండటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంద‌రు మ‌ధ్య‌లోనే జిమ్ మానేస్తుంటారు. అయితే ఇలా ఒక్కసారిగా ఆపేస్తే శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు వేగంగా పెర‌గ‌డం

జిమ్ చేస్తున్నప్పుడు శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. కానీ ఒక్కసారిగా ఆపేస్తే ఆ క్యాలరీలు బర్న్ కావు. ఫలితంగా అవి శరీరంలో ఫ్యాట్‌గా నిల్వ అవుతాయి. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు త్వరగా పెరుగుతుంది.

కండరాల బలం తగ్గుతుంది

రెగ్యులర్ వర్కౌట్ వల్ల కండరాలు బలంగా ఉంటాయి. కానీ జిమ్ మానేసిన తర్వాత కొన్ని వారాల్లోనే అవి బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. కండరాలు కాస్త కుదించుకుపోతాయి. చిన్న పనులు చేసినా అలసట ఎక్కువగా అనిపిస్తుంది.

స్టామినా, శక్తి తగ్గిపోతాయి

వ్యాయామం వల్ల శరీరానికి శక్తి, సహనం పెరుగుతుంది. కానీ వర్కౌట్ ఆపేస్తే ఈ శక్తి తగ్గుతుంది. కొద్ది రోజులకే మెట్లు ఎక్కినా, చిన్నగా నడిచినా ఆయాసం వ‌స్తుంది. శరీరం త్వరగా అలసిపోతుంది.

మెటబాలిజం నెమ్మదిస్తుంది

జిమ్ వల్ల మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. అంటే శరీరం క్యాలరీలను త్వరగా ఖర్చు చేస్తుంది. కానీ జిమ్ మానేసిన తర్వాత మెటబాలిజం స్లో అవుతుంది. దాంతో ఫ్యాట్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.

మానసిక స్థితిపై ప్రభావం

వ్యాయామం చేస్తే “హ్యాపీ హార్మోన్స్” విడుదల అవుతాయి. అందుకే మనసు ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ వర్కౌట్ ఆపేస్తే కొన్ని రోజుల్లోనే చిరాకు, టెన్షన్, మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. కొందరికి డల్‌గా, నిరుత్సాహంగా అనిపిస్తుంది.

గ‌మ‌నిక‌: జిమ్‌ను ఒక్కసారిగా మానేయడం కంటే క్రమంగా తగ్గించడం మంచిది. పూర్తిగా ఆపాల్సి వచ్చినా కనీసం నడక, చిన్న వ్యాయామాలు కొనసాగిస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story